Heavy rains in Mumbai | మహారాష్ట్రలోని ముంబైలో(Mumbai) నైరుతి రుపవనాల ప్రవేశంతో వర్షాలు(Heavy rains) దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో.. అత్యంత రద్దీగా ఉండే అంధేరి సబ్వేలో వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు అండర్‌పాస్‌ను పూర్తిగా మూసివేశారు. సబ్వే మూసివేయబడటంతో ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి ట్రాఫిక్ పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించి వాహనాలను ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు.
వరద నీటిని తొలగించడానికి బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) సిబ్బంది డీవాటరింగ్ పంపులను ఉపయోగించి నీటిని బయటకు పంపుతున్నారు.
24 గంటల వ్యవధిలో మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో ముంబైశివారు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) తెలిపింది. కుండపోత వర్షాల నేపథ్యంలో అవసరమైతే తప్పా ప్రజలు బయటికి రావొద్దని అధికారులు సూచించారు.