Anchor Rashmi | బుల్లితెర యాంకర్ రష్మీ ఆసుపత్రిలో చేరింది. ఇటీవల తనకు శస్త్ర చికిత్స జరిగినట్లు ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వైద్యులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది.
ఐదు రోజుల్లో నా హెమోగ్లోబిన్ స్థాయి 9కి పడిపోయింది. జనవరి నుంచి అకాల రక్తస్రావం, భుజం నొప్పితో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఏ సమస్యకు ముందు చికిత్స అవసరమో తెలియక వైద్యులు కూడా గందరగోళంలో పడ్డారు. మార్చి 29 నుంచి నా శరీరం పూర్తిగా నీరసించిపోయింది. అయినప్పటికీ, నా వృత్తిపరమైన కట్టుబాట్లను పూర్తి చేసి, ఏప్రిల్ 18న శస్త్రచికిత్స చేయించుకున్నాను. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. మరో మూడు వారాలు విశ్రాంతి తీసుకుని, తిరిగి పని ప్రారంభిస్తాను,” అని పేర్కొన్నారు.