
బుల్లితెర వ్యాఖ్యాత, నటి అనసూయకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి సుదర్శన్రావు(63) ఆదివారం హైదరాబాద్లో అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ సుదర్శన్రావు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు అనసూయ, వైష్ణవి ఉన్నారు. సుదర్శన్రావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.