హైదరాబాద్: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ చిత్రం విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే. ఆ ఫిల్మ్‌లో నటిస్తున్న విజయ్ దేవరకొండ, అనన్యపాండే ప్రస్తుతం ఆ ఫిల్మ్ ప్రమోషన్లో ఉన్నారు. ఇండియా మొత్తం టూర్ చేస్తున్న ఆ జంట.. తాజాగా వరంగల్ కూడా వెళ్లింది. అయితే ఇవాళ అనన్య పాండే హైదరాబాద్‌లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లింది. అక్కడ లైగర్ పార్ట్నర్ అనన్యకు విజయ్ తల్లి స్వాగతం పలికింది. ఇంటికి వచ్చిన సందర్భంగా పూజారులతో పూజలు చేయించింది. దీనికి సంబంధించిన ఫోటోలను అనన్య తన ఇన్‌స్టాలో అప్డేట్ చేసింది. విజయ్ అమ్మ దీవించినట్లు దానికి ట్యాగ్‌లైన్ ఇచ్చింది లైగర్ బ్యూటీ. థ్యాంకూ ఆంటీ అంటూ కూడా అనన్య పేర్కొన్నది.