Ananthika Sanilkumar | మ్యాడ్, 8వసంతాలు వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి అనంతిక సనీల్ కుమార్ మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో స్టార్ దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తృప్తి డిమ్రీ కథానాయికగా నటించబోతుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లకముందే ఒక చిన్న సినిమాను సందీప్ నిర్మించబోతున్నాడు. సందీప్ సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్‌పై రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వేణు అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రంలో 8వసంతాలు భామ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుండగా.. ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ ఇందులో హీరోగా కనిపించబోతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.