Mirai | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘OG’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలకు ముందు నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబడటం ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. హైదరాబాద్‌లో ఒక్క రోజు OG సినిమా కోసం 550 స్పెషల్ షోలు ప్లాన్ చేసిన థియేటర్ల యాజమాన్యాలు, ఇప్పటికే వాటన్నింటినీ హౌస్‌ఫుల్‌గా ప్రకటించడం గమనార్హం. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లు అన్నీ ఓజీతో కళకళలాడుతున్నాయి. పవన్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని, థియేటర్ల యాజమాన్యాలు ఇతర సినిమాల షెడ్యూళ్లను తక్షణమే మార్చేస్తున్నాయి.
ఇలాంటి హై వోల్టేజ్ సన్నివేశంలో, ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోన్న ‘మిరాయ్’ సినిమా నిర్మాతలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మిరాయ్ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్, హీరో తేజ సజ్జా OGకు స్క్రీన్ క్లియర్ చేసి అభిమానుల హృదయాలను గెలిచారు. OG విడుదల రోజైన సెప్టెంబర్ 25న, మిరాయ్ సినిమా స్క్రీన్‌పై ప్రదర్శించబడదు. OG సినిమాకు స్క్రీన్లు కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మిరాయ్ యూనిట్ స్పష్టం చేసింది. శుక్రవారం (సెప్టెంబర్ 26) నుంచి మళ్లీ కేటాయించిన స్క్రీన్లలో మిరాయ్ సినిమాను ప్రదర్శించనున్నారు. పవన్ కళ్యాణ్‌కు వ్యక్తిగతంగా ఎంతో సన్నిహితుడైన నిర్మాత విశ్వప్రసాద్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పవన్ అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోవైపు తేజ సజ్జా చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అభిమాని అనే విషయం తెలిసిందే. పవన్ అంటే కూడా చాలా ఇష్టం. ఈ క్రమంలో మిరాయ్ టీమ్ పవన్ సినిమాను సెలబ్రేట్ చేయడమే కాదు, ఫ్యాన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. సోషల్ మీడియాలో పవన్ అభిమానులు, సినీ లవర్స్ మిరాయ్ టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఇది రియల్ రిస్పెక్ట్! మిరాయ్ టీమ్ సాల్యూట్! అంటూ కామెంట్ చేస్తున్నారు. OG రిలీజ్‌కి ఈ మాత్రం సపోర్ట్ ఇచ్చిన మీరే మాస్టర్స్!, తేజ సజ్జా.. ఇప్పుడు మా హీరో కూడా! అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ రోజు రాత్రి 9 గం.లకి ప్రీమియర్స్ పడనుండగా, దాంతో మూవీ టాక్ ఏంటో తెలిసిపోతుంది.