చంబా: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. రామ్‌లీల(Ramleela) నాటకం వేస్తున్న పాత్రధారుల్లో.. దరశధుడి పాత్ర పోషించిన వ్యక్తి స్టేజ్‌పైనే గుండెపోటుతో మృతిచెందాడు. సీనియర్ స్టేజ్ ఆర్టిస్టు అమ్రిశ్ కుమార్ అనే నటుడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం రాత్రి లైవ్ పర్ఫార్మెన్స్ సమయంలో ఈ ఘటన జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని అమ్రిశ్ కుమార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. స్థానికంగా స్టేజ్ థియేటర్లో ఆయన నిష్ణాత నటుడు. మంగళవారం నాటకం వేస్తున్న సమయంలో అతనికి అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది. రాముడి తండ్రి దశరధుడి పాత్రను ఆయన పోషించారు.
నాటకంలో భాగంగా స్టేజ్‌పైన తన డైలాగ్స్ చెబుతున్న సమయంలో కుమార్‌కు గుండెనొప్పి వచ్చింది. డైలాగ్స్ చెప్పేందుకు తడబడ్డ అతను అక్కడే కూలిపోయాడు. ఇదంతా వీడియోకు చిక్కింది. నాటకంలోని ఇతర పాత్రధారులు, ప్రేక్షకులు ఆందోళన చెందారు. నిర్వాహకులు వెంటనే నాటకాన్ని ఆపరేశారు. కుమార్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అతను మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు.
హిమాచల్‌లో అమ్రిశ్ కుమార్ ఓ పెద్ద స్టార్. రామ్‌లీలా నటకాన్ని గత అయిదు దశాబ్ధాలుగా చేస్తున్నాడు. పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఆయన జనాల్ని ఆకట్టుకునేవాడు. దశరథుడు, రావణుడి పాత్రల్లో నటించేవారు. ఆయన పర్ఫార్మెన్స్ చూసేందుకు జనం ఎగబడేవారు. అమ్రిశ్ కుమార్ మృతి పట్ల రామ్‌లీలా క్లబ్ సభ్యుడు సుదేశ్ మహాజన్ సంఘీభావం ప్రకటించారు. ఇది తీరని లోటు అని పేర్కొన్నారు. అమ్రిశ్ మృతికి సంతాపంగా రామ్‌లీలా క్లబ్ కొన్ని రోజల పాటు షోలను రద్దు చేసింది.
A man playing the role of King Dashrath collapsed and died on stage during the Ramleela in Chamba district of Himachal Pradesh. pic.twitter.com/6bThTX2LIk
— Piyush Rai (@Benarasiyaa) September 24, 2025