పీసీ చాకో ఆరోపణలను తోసిపుచ్చిన ఆనంద్ శర్మ!

న్యూఢిల్లీ : పార్టీలో గ్రూపిజం పెరుగుతోందని ఆరోపణలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీని వీడిన పీసీ చాకో ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ తోసిపుచ్చారు. బీజేపీని ఓడించేందుకు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. సంస్ధాగత మార్పులు కోరుతూ పార్టీ హైకమాండ్‌కు లేఖ రాసిన జీ 23 నేతల్లో ఒకరైన ఆనంద్ శర్మ రానున్న ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓటమికి పార్టీ సమైక్యంగా పోరాడుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం బీజేపీ సహా ఇతర ప్రత్యర్ధులను ఓడించడమేనని మీడియాతో మాట్లాడుతూ శర్మ వ్యాఖ్యానించారు. పార్టీలో వర్గాలపై తప్పుడు అభిప్రాయం ఉండరాదని, సంస్ధాగత చర్చలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ సిద్ధమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరం నాటి నుంచి దిగ్గజ నేతల మధ్య భిన్నాభిప్రాయాలున్నా చర్చలతో సమైక్యంగా లక్ష్యం దిశగా సాగిన సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉందని గుర్తుచేశారు. ఇక పార్టీలో గ్రూపిజం పెరిగిపోతున్నా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ఆరోపిస్తూ సీనియర్ నేత పీసీ చాకో బుధవారం పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Anand Sharma
- Congress
- pc chako
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
New Zealand: గాయపడ్డ ఇద్దరు కివీస్ క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కు దూరం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

