రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అమ్మాయి’. పూజా భలేకర్ కథానాయికగా నటిస్తున్నది. ఆర్ట్ సీ మీడియా, పారిజాత మూవీ క్రియేషన్స్, బిగ్ పీపుల్ సంస్థలు నిర్మించాయి. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదలకానున్నది. నిర్మాతలు మాట్లాడుతూ ‘మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యమున్న పూజా భలేకర్పై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు ఉత్కంఠను పంచుతాయి. రామ్‌గోపాల్‌వర్మ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రమిది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు చైనీస్ భాషలో సినిమాను విడుదలచేయబోతున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్, డీఎస్ఆర్, కెమెరామెన్: మల్హర్భట్జోషి.