గంగాధర, ఫిబ్రవరి 28: చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ప్రజలకు స్వయంగా ఫోన్ చేసి ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. గంగాధరలో సోమవారం లబ్ధిదారులకు ఫోన్‌చేసి సమాచారం తెలుసుకొన్నారు. ‘సుజాత గారా, అమ్మా నేను చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌ను మాట్లాడుతున్నా. ఇటీవల మీ కూతురు పైళ్లి చేశారు కదా. మీకు కళ్యాణలక్ష్మి మంజూరు చేయించాం. వారం రోజులో చెక్కు అందజేస్తాం. రోజూ నల్లా నీళ్లు వస్తున్నయా?, 24 గంటలు కరెంటు ఉంటుందా?’ అని వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఇవ్వన్ని ఎవరు ఇస్తున్నారని ఆమెను అడగగా కేసీఆర్ సారు ఇస్తుండని సమాధానం చెప్పింది. అమ్మా ఇన్ని పథకాలను ఇస్తున్న కేసిఆర్ సారును మరచిపోవద్దని కోరారు.