Gurugram Encounter: ఎన్కౌంటర్లో 60 రౌండ్ల ఫైరింగ్.. నలుగురు గ్యాంగ్స్టర్లు మృతి.. ముగ్గురు పోలీసులకు గాయాలు
Gurugram Encounter: ఢిల్లీలోని గురుగ్రామ్‌లో గురువారం రాత్రి పోలీసులు, నేరస్థుల మధ్య ఫైరింగ్ జరిగింది. సుమారు 60 రౌండ్ల పాటు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలో నలుగురు నేరస్థులు మృతిచెందగా, ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
గురుగ్రామ్: ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో గురువారం రాత్రి పోలీసులు, నేరస్థుల మధ్య ఫైరింగ్(Gurugram Encounter) జరిగింది. సుమారు 60 రౌండ్ల పాటు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలో నలుగురు నేరస్థులు మృతిచెందగా, ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక ఫేజ్‌లో ఆ ఎన్కౌంటర్ జరిగింది. గురువారం రాత్రి 9.30 నిమిషాలకు క్రైం బ్రాంచ్ పోలీసులు సమాచారం అందుకున్నారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో సాయుధ వ్యక్తులు ఉన్నట్లు తెలిసింది. ఆ ఇంటెలిజెన్స్ ఆధారంగా క్రైం బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సువాంత్ లోక్ ఫేజ్‌లో ఉన్న ఓ వ్యాపారి ఇంటి వద్ద ఈ ఎన్కౌంటర్ జరిగింది. విదేశాల్లో ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్.. వ్యాపారి నుంచి బెదిరింపుకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అనుమానిత నిందుతలను పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోవాలని ఆదేశించారు. కానీ నిందిత వ్యక్తులు విచక్షణారహితంగా ఫైరింగ్ చేశారు. ఆ కాల్పులకు కౌంటర్‌గా పోలీసులు ఫైరింగ్‌కు దిగారు.
దీపక్ నందల్ గ్యాంగ్‌కు చెందిన షూటర్లు ఈ కాల్పుల్లో పాల్గొన్నారు. అందరికీ గాయాలు అయినట్లు తెలిసింది. ఓ ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. కానీ నలుగురు మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. అయిదో వ్యక్తి మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు గురుగ్రామ్ పోలీసులు కూడా గాయపడ్డారు. వాళ్లను కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సీఎం నిలిపివేత.. ఇది కేంద్రం వేధింపులేనని ఆప్ ఆరోపణ
Credit Cards | క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనా చార్జీల్లేవ్.. యూజర్లకు ఆర్బీఐ ఊరట
Parakala Prabhakar | ‘సర్’ వ్యతిరేక నిరసనలో పరకాల ప్రభాకర్
Rajiv Yuva Vikasam | కొందరికే యువవికాసం.. యువతకు మరోసారి కాంగ్రెస్ దగా!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

