అంబటి అర్జున్, శ్రీపూజారెడ్డి, స్నేహ కీలక పాత్రలు పోషించిన వెబ్‌సిరీస్ ‘పోచమ్మ’. మిస్టీరియస్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు రమేశ్ ఇంద్ర దర్శకుడు. శ్రుతి నాయుడు నిర్మాత. ఈ నెల 17 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా ఈ సిరీస్‌కి చెందిన ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఆహ్లాదకరమైన అటవిప్రాంతంలో ఓ అందమైన ఇల్లు.
ఆ ఇంటిముందే పోచమ్మతల్లి గుడి. ఆ తల్లిని పూజిస్తున్న జనం. ఆ ఇంటినీ, ఆ ప్రాంతాన్ని ఆ తల్లి కాపాడుతుంటుంది. అలాంటి తల్లి గుడినీ, ఆమె విగ్రహాన్ని తొలగిస్తే ఆ తల్లి ఊరుకుంటుందా? ఆ తప్పు చేసిన వారిని పోచమ్మ ఎలా శిక్షించింది? అనేది ట్రైలర్లో రోమాంచితంగా చూపించారు. ఓ యువజంట ప్రేమ.. దానికి అడ్డుపడే కొందరు వ్యక్తుల్ని కూడా ట్రైలర్లో చూడొచ్చు. థ్రిల్లింగ్, డివైన్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ సాగింది.