Amazon : ఆఫీస్ స్పేస్‌ను కుదించడం ద్వారా రాబోయే కొన్నేండ్లలో రూ. 10,000 కోట్లు ఆదా చేయాలని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ యోచిస్తోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆఫీస్ స్పేస్‌ను మెరుగ్గా వినియోగించుకోవడం ద్వారా నిర్ధేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అమెజాన్ కసరత్తు సాగిస్తోంది. అమెజాన్ ప్రస్తుతం ఆఫీస్ వ్యాకెన్సీ రేటు 34 శాతంగా ఉంది. దీన్ని మెరుగ్గా నిర్వహించేందుకు లీజులు సహజంగా ముగియడానికి అనుమతించడం, కొన్ని కార్యాలయ అంతస్తుల వినియోగాన్ని నిలిపివేయడంతో పాటు ఎంపిక చేసిన భవనాల కోసం ఒప్పందాల ముందస్తు ముగింపులపై చర్చలు జరపడం వంటివి ఉన్నాయి.
ఈ చర్యల ద్వారా కార్యాలయాల స్పేస్‌ను మెరుగ్గా వాడుకోవడంతో పాటు ఏటా కోట్లాది రూపాయలు ఆదా చేయవచ్చని అమెజాన్ కసరత్తు సాగిస్తోంది. ఉద్యోగులు కార్యాలయాలను ఎలా ఉపయోగిస్తున్నారు అనే ట్రెండ్లను విశ్లేషించడం ద్వారా అమెజాన్ వ్యాపారాల విభిన్న అవసరాల ఆధారంగా తాము తమ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను నిరంతరం సమీక్షిస్తామని కంపెనీ ప్రతినిధి బ్రాడ్ గ్లాసర్ చెప్పారు.
తాము ప్రస్తుతం పరిమితంగా ఆఫీస్ స్పేస్ ఉన్న చోట అదనపు స్థలాన్ని తీసుకోవచ్చు అలాగే అదనపు సామర్థ్యం ఉన్న చోట సర్దుబాట్లు చేయవచ్చు అని గ్లాసర్ తెలిపారు. సంస్ధ నిర్వహణా సామర్ధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఇది కంపెనీ రిటన్ టూ ఆఫీస్ విధానానికి భిన్నమైనదేనని గ్లాసర్ అంగీకరించారు. అమెజాన్ సిబ్బంది అవసరాలకు అనుగుణంగా కార్యాలయ స్పేస్‌ను అందుబాటులో ఉంచడంపై దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు.
Read More :
Pushpa The Rule | మరో పుష్పరాజ్‌ను చూశారా..? ట్రెండింగ్‌లో అల్లు అర్జున్ స్టిల్స్