Alternatives To Eggs | కోడిగుడ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కోడిగుడ్లలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. అత్యుత్తమ ప్రోటీన్లు, విటమిన్ డి, అనేక రకాల బి విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందుకనే కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. అయితే కోడిగుడ్లను కొందరు తినలేరు. శాకాహారం తినేవారితోపాటు అలర్జీలు ఉండేవారు కోడిగుడ్లను తినరు. దీని వల్ల అనేక పోషకాలను కోల్పోయిన భావన కలుగుతుంది. అయితే కోడిగుడ్లను తినకపోయినా ఫర్వాలేదు, ఎందుకంటే అచ్చం గుడ్లలో ఉండే లాంటి పోషకాలు ఇతర శాకాహారాల్లోనూ ఉంటాయి. వాటిని తినడం వల్ల కూడా కోడిగుడ్లను తిన్న లాంటి పోషకాలను పొందవచ్చు. ఆయా ఆహారాలను కోడిగుడ్లకు చక్కని ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. అందువల్ల వాటిని తింటే కోడిగుడ్ల మాదిరిగా ఎన్నో పోషకాలను పొందవచ్చు.
సోయా టోఫును కోడిగుడ్లకు చక్కని ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇందులో అత్యుత్తమ స్థాయి వృక్ష సంబంధ ప్రోటీన్లు ఉంటాయి. మన శరీరానికి కావల్సిన 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు మనకు సోయా టోఫు ద్వారా లభిస్తాయి. అలాగే ఐరన్, క్యాల్షియం, మాంగనీస్ కూడా అధిక మొత్తంలో లభిస్తాయి. సోయా టోఫును తినడం వల్ల కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ అసలే ఉండదు. కనుక బరువు తగ్గడం తేలికవుతుంది. ఇందులో ఉండే ఐసో ఫ్లేవోన్స్ ఎముకలను, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే పెరుగును కూడా కోడిగుడ్లకు ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. క్యాల్షియంను అధికంగా పొందవచ్చు. పెరుగును అత్యుత్తమ ప్రొ బయోటిక్ ఆహారంగా చెబుతారు. దీన్ని రోజూ తింటుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. క్యాల్షియం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.
పప్పు దినుసులు, బీన్స్‌ను కూడా కోడిగుడ్లకు చక్కని ప్రత్యామ్నాయ ఆహారంగా పేర్కొనవచ్చు. వీటిల్లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ప్రోటీన్లు సైతం అధికంగా లభిస్తాయి. ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలను కూడా పొందవచ్చు. వీటిని తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఫోలేట్ వల్ల గర్భస్థ శిశువుకు మేలు జరుగుతుంది. గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే కోడిగుడ్లను తినలేని వారు కినోవాను తీసుకోవచ్చు. ఇందులోనూ ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. అలాగే ఫైబర్, మెగ్నిషియం, ఐరన్ వంటి పోషకాలను సైతం పొందవచ్చు. కినోవాను తింటే శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట తగ్గుతాయి. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. కినోవాలో ఉండే మెగ్నిషియం కారణంగా కండరాలు ప్రశాంతంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల నొప్పులు తగ్గుతాయి. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
కోడిగుడ్లను తినని వారికి పనీర్ కూడా చక్కని ఆహారం అని చెప్పవచ్చు. దీన్ని తింటున్నా కూడా హై క్వాలిటీ ప్రోటీన్లు లభిస్తాయి. అలాగే క్యాల్షియం, విటమిన్ బి12 వంటి పోషకాలను సైతం పొందవచ్చు. పనీర్‌ను తినడం వల్ల శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. కండరాలకు మరమ్మత్తులు జరుగుతాయి. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే అవిసె గింజలను తింటున్న కూడా ఉపయోగం ఉంటుంది. వీటిని కూడా కోడిగుడ్లకు ప్రత్యామ్నాయ ఆహారంగా చెప్పవచ్చు. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మెదడును, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావల్సిన ఫైబర్‌ను అందిస్తాయి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా కోడిగుడ్లను తిననివారు ఆయా ఆహారాలను వాటికి ప్రత్యామ్నాయంగా తినవచ్చు. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.