Dhurandhar | బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ధురంధర్’ (Dhurandhar). ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ (Uri: The Surgical Strike) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రణ్వీర్ సింగ్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఇప్పటినుంచే ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి ఆర్. మాధవన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రణ్వీర్ సింగ్ తన సోషల్ మీడియా వేదికగా మాధవన్ లుక్‌ను షేర్ చేస్తూ.. ఆ పాత్రను కర్మ యొక్క రథసారథి(The Charioteer of Karma)గా అభివర్ణించారు. విడుదలైన పోస్టర్లో మాధవన్ ప్యాంట్-సూట్లో చాలా గంభీరంగా మరియు శక్తివంతమైన అవతార్‌లో కనిపిస్తున్నారు. ఆయన పాక్షికంగా గుండు చేయించుకున్న హెయిర్ స్టైల్, తీవ్రమైన చూపు ఆ పాత్ర ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. రణ్వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఈ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 12న విడుదల కానుంది.
The Charioteer of Karma.
3 Days To Go! #DhurandharTrailer out on 12th November at 12:12 PM.
In Cinemas 5th December.#AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande @LokeshDharB62 @jiostudios @B62Studios… pic.twitter.com/sFHwDp7XeQ
— Ranveer Singh (@RanveerOfficial) November 9, 2025