టీకా వేయిద్దాం
- 22.79 లక్షల మంది పిల్లలే లక్ష్యం
- ఇప్పటికే 6 లక్షల మంది పిల్లల రిజిస్ట్రేషన్ పూర్తి
- విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి

బడంగ్‌పేట,జనవరి3 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు. రూ. 25లక్షలతో నిర్మించిన వెయిటింగ్ హాల్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 6 లక్షల మంది పిల్లలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. 15 – 18 సంవత్సరాల 22.79 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో 2.35లక్షల మందికి వ్యాక్సినేషన్‌కు అర్హులుగా గుర్తించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మి, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, డీఈఈ గోపీనాథ్, కార్పొరేటర్లు సిద్దాల లావణ్య బీరప్ప, అర్కల భూపాల్‌రెడ్డి, మాధవి ఈశ్వర్‌గౌడ్, ధనలక్ష్మి రాజ్‌కుమార్, గజ్జల రాంచందర్, లీలా రవినాయక్, అరుణ ప్రభాకర్‌రెడ్డి, బాలమణి, పల్లె జంగయ్య గౌడ్, టీఆర్ఎస్ నాయకులు అర్కల కామేష్‌రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, పి జోజి, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

