Allu Arjun | పుష్ప2 చిత్రంతో తన ఇమేజ్‌ని అమాంతం పెంచుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో ఓ చిత్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లు అర్జున్ బర్త్ డే రోజు ఈ చిత్రాన్ని అధికారకంగా ప్రకటిస్తూ..చిత్ర బృందం ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోతో ఈ చిత్రం ఏ స్థాయిలో నిర్మాణం జరుపుకుంటుందో మనకి అర్ధమవుతుంది. సమాంతర ప్రపంచం, పునర్జన్మ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్ర కథ ఉండబోతోందనే టాక్ నడుస్తుంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పై అగ్ర నిర్మాత కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
జులై చివరి వారం లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ లో షూట్ కి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పుష్ప సిరీస్ విజయం తరవాత ఆయనకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టగా, తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే అల్లు అర్జున్ ముంబయిలోని మెహబూబ్ స్టూడియోలో లుక్ టెస్ట్ నిర్వహించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రెండో లుక్ టెస్ట్ కూడా జరగనుంది. ఈ పరీక్ష కూడా ముంబయిలోనే నిర్వహించనున్నారు. ఈ టెస్ట్‌లో అల్లు అర్జున్ లుక్స్‌ని ప్రయోగాత్మకంగా పరిశీలించబోతున్నట్టు తెలుస్తుంది.
ఒక లుక్‌లో హెవీ ప్రోస్తెటిక్స్ మేకప్ ఉపయోగించనున్నట్లు సమాచారం. పాత్రకు తగ్గట్టు భిన్నమైన మేకోవర్లను ప్రయత్నిస్తూ నటనకు కొత్త ఒరవడి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ లుక్ టెస్ట్‌లు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అట్లీ చిత్రం కోసం అల్లు అర్జున్ మల్టిపుల్ గెటప్పులలో కనిపించబోతున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావల్సి ఉంది. అట్లీతో అల్లు అర్జున్ మొదటిసారి పనిచేయనుండటంతో ఇది అభిమానుల్లో పెద్ద అంచనాలు పెంచుతోంది. పార్లల్ యూనివర్స్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని టాక్.