అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ జన్మదిన వేడుకలు దుబాయ్‌లోని ప్రఖ్యాత బుర్జ్‌ఖలీఫాలో జరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ భవనంలోని ఓ ఫ్లోర్లో ఈ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. పూర్తి వ్యక్తిగతమైన ప్రైవేట్ ఫ్లోర్ ఇదని, ఇప్పటివరకు ఎవరూ ఇందులో జన్మదిన వేడుకలు జరుపుకోలేదని తెలిసింది. అత్యంత ఎత్తులో జరుపుకున్న తొలి పుట్టినరోజు వేడుక ఇదేనని చెబుతున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి పాల్గొన్నారు.