అలీఘర్: ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అతివాద నేతపై యూపీలోని అలీఘర్‌లో కేసు నమోదు అయ్యింది. సాధ్వి అన్నపూర్ణ అలియాస్ పూజా షాకున్ పాండేపై కేసు బుక్ చేశారు. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచే రీతిలో ఆమె కామెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో వివాదాస్పద ప్రకటనలు చేసిన ఆమెను రెండు సార్లు అలీఘడ్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఆ రెండు కేసుల్లో ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు. అలీఘడ్‌లోని గాంధీపార్క్ పోలీస్ స్టేషన్లో 153ఏ, 153బీ 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు ఎస్పీ కళానిధి నైతాని తెలిపారు. 2019లో గాంధీ దిష్టబొమ్మపై పూజా షాకున్ కాల్పులు జరిపారు. గాడ్సేను కీర్తిస్తూ ఆమె నినాదాలు చేశారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ధర్మ సంసద్లోనూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనలో ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.