Alia Bhatt | ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అందాల ముద్దుగుమ్మలు తెగ సందడి చేస్తున్నారు. వెరైటీ డ్రెస్సులలో వచ్చి కనువిందు చేస్తున్నారు. ఈ సారి కూడా కేన్స్‌లో అందాల తార ఐశ్వర్య రాయ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మొదటి రోజన రెడ్ కార్పెట్‌పై చీరలో తళుక్కుమన్న ఈ భామ తెల్లటి చీరలో, నుదుట సిందూర్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఇండియా సత్తాను ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచానికి గుర్తు చేస్తూ… భారత సంప్రదాయాలకు, సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఐష్ ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. ఇక రెండో రోజు అయితే మోడ్రన్ డ్రెస్ లో కనిపించింది. అయితే ఆ డ్రెస్‌లోను ఆమె భారతీయ సంస్కృతి సంప్రదాయలకు విలువనిచ్చారు. తన డ్రెస్‌పై భగవద్గీత శ్లోకంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.
బనారసీ కేప్పై ‘భగవద్గీతలోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే శ్లోకం ఉందని, చేతితో ఆ శ్లోకాన్ని సంస్కృతంలో ఎంబ్రాయిడరీ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇండియా నుండి కేన్స్‌కి అలియా భట్ వస్తుందని ముందు చెప్పుకొచ్చారు. తొలి రోజే ఆమె హాజరు కావల్సి ఉన్న భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది. ఎట్టకేలకి వేడుక ముగిసే సమయానికి అలియా భట్ కేన్స్ లో మెరిసి తమ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశారు. తొలిసారి కేన్స్‌లో అడుగుపెట్టిన అలియా సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఫ్లోరల్ గౌన్ ధరించి నాజూగ్గా కనిపించారు.
when i say god is a woman i mean simone ashley and alia bhatt 🛐 pic.twitter.com/LP9Lxahsz2
— 🕸 (@biiloranii) May 23, 2025
కేన్స్‌కి వెళ్లక ముందే తన లుక్‌కి సంబంధించిన ఫొటోలని ఇన్‌స్టాలో షేర్ చేసింది అలియా. కొంటె చూపుల్తోనే కాల్చి చంపేలా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే అలియా ఎల్ ఓరియెల్ పారిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ ఫెస్టివల్లో పాల్గొంది. మే 13 నుండి 24 వరకు కేన్స్ ఫెస్టివల్ జరగనుండగా, చివరి క్షణాలలో వచ్చి అలియా అలరించింది.