Akhil| టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఇంట్లో ఏదైన వేడుక జరుగుతుంది అంటే ఫ్యాన్స్ అందరు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. కొద్ది రోజుల క్రితం శోభిత- నాగ చైతన్య పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూశాం. ఇక అక్కినేని అఖిల్ పెళ్లి మార్చిలో జరగనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అఖిల్ ఇదివరకే శ్రియ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల వారిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు.
ఇక అఖిల్ ఈ సారి ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రావ్డీ కూతురు జైనాబ్ రావ్డీతో ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్‌గా నడిపించాడు. నవంబర్ 26వ తేదీ, 2024 రోజున వారి ఎంగేజ్‌మెంట్‌ను భారీగా ప్రైవేట్ కార్యక్రమంగా జరిపించారు కింగ్ నాగార్జున.. ఆ రోజు నాగ్ నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేయడంతో అఖిల్, జైనబ్‌ల రిలేషన్ బయట పడింది. ఇక మొదట్లో మార్చి 24న అఖిల్ అక్కినేని పెళ్లి అంటూ వార్తలు జోరుగా వినిపించాయి.కానీ ఈ వార్తలపై అక్కినేని ఫ్యామిలీ అసలు స్పందించలేదు. అఖిల్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడమే తప్ప అక్కినేని ఫ్యామిలీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
మార్చి 24న అఖిల్ పెళ్లి అని కొందరు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. కాని ఆ డేట్ దాటిపోయింది. దీంతో మళ్లీ అఖిల్ పెళ్లి విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈ సంవత్సరమే చేస్తారా లేకుంటే ఇంకాస్త టైం తీసుకుంటారా అనే ప్రశ్న కూడా అందరి మదిలో తలెత్తుతుంది. ఇక అఖిల్ పెళ్లి హైదరాబాద్ లోనా లేదంటే జైనబ్ కోసం దుబాయ్ లో చేస్తారా అనే దానిపై కూడా ఇప్పుడు క్లారిటీ లేదు. మరి అఖిల్ పెళ్లి గురించి ఎప్పుడు పూర్తి క్లారిటీ వస్తుందా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే..అక్కినేని హీరోగా అఖిల్ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే ఇప్పటివరకు అఖిల్ నటించిన ఒక సినిమా కూడా మంచి విజయం సాధించలేకపోయాయి. అఖిల్ త్వరలోనే రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న సినిమాతో ప్రేక్షకులని అలరిస్తాడని అంటున్నారు.