e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News Akash Puri | నాన్న కాలర్‌ ఎగరేయాలి!

Akash Puri | నాన్న కాలర్‌ ఎగరేయాలి!

‘నా విజయాన్ని నాన్న ఆస్వాదించాలి. ఆ సక్సెస్‌ ఏ సినిమాతో వస్తుందన్నది కాదు..నేను హిట్‌ కొట్టాలి. మా నాన్న కాలర్‌ ఎగరేయాలి. ఎంజాయ్‌ చేయాలి. ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నా’ అని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఆకాష్‌పూరి. ఆయన హీరోగా అనిల్‌ పాదూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రొమాంటిక్‌’. పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మాతలు. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర కథానాయకుడు ఆకాష్‌ పూరి పాత్రికేయులతో సంభాషిస్తూ పంచుకున్న ముచ్చట్లివి…

ఎమోషనల్‌ లవ్‌స్టోరి
భావోద్వేగభరితంగా సాగే ప్రేమకథా చిత్రమిది. ఇందులో నేను వాస్కోడిగామా అనే పాత్రలో కనిపిస్తా. పోలీస్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుంటాను. అందరికంటే భిన్నంగా నా రూటే సపరేటు అనే వ్యక్తిత్వంతో కనిపిస్తా. నాన్న ఈ కథను ఎప్పుడో రాసుకున్నారు. నాన్న డైరెక్ట్‌ చేసిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’..ఈ సినిమా ఒకేసారి మొదలయ్యాయి. ‘ఇస్మార్ట్‌శంకర్‌’ పెద్ద విజయం సాధించడంతో ‘రొమాంటిక్‌’ ను ఇంకా బాగా తీయాలనుకున్నాం. రమ్యకృష్ణగారు ఈ సినిమాలో జాయిన్‌ కావడంతో ఈ ప్రాజెక్ట్‌ స్థాయి పెరిగింది. ఈ సినిమాలో శక్తివంతమైన పోరాటఘట్టాలతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటుంది.

- Advertisement -

నా పనైపోయిందన్నారు..
నాన్న సినిమాల్లో చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. వాస్కోడిగామా కూడా అదే విధంగా నిలిచిపోతుంది. నా పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. చిన్నతనం నుంచి మా నాన్న రాసిన డైలాగ్స్‌ హీరోలు చెబుతుంటే విని సంతోషించేవాడిని. ఇప్పుడు నాన్న రాసిన సంభాషణలు నేను చెప్పడం కొత్త అనుభూతినిచ్చింది. దర్శకుడు అనిల్‌ పాదూరి ఈ సినిమాను అద్భుతంగా డీల్‌ చేశారు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో నేను చాలా ఎమోషనల్‌గా మాట్లాడాను. నా మనసులో వున్న మాటల్ని చెప్పాను. మా నాన్నకు ఫెయిల్యూర్స్‌ వచ్చినప్పుడు ఆయన పనైపోయిందని చాలా మంది అన్నారు. అలాగే నా పని కూడా అయిపోయిందన్నారు. కానీ ‘ఇస్మార్ట్‌శంకర్‌’తో నాన్న హిట్‌ కొట్టి తానేమిటో చూపించాడు.

భవిష్యత్తులో దర్శకత్వం చేస్తా..
ఈ సినిమా చూసిన తర్వాత నాన్న చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యారు. నాన్న నా కోసం ఎంతో చేశారు. డబ్బులు ఖర్చు పెట్టారు. అందుకే నాన్నకు నేను తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. మంచి విజయం సాధించిన తర్వాత ఆయనతో ఓ సినిమా చేస్తాను. ప్రభాస్‌గారికి నేను చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం ఆయనే మమ్మల్ని ముంబయి పిలిపించుకున్నారు. ఆయనతో ఉన్న ఆ ఒక్కరోజును ఎప్పటికీ మరచిపోలేను. హీరోగా నిలదొక్కుకున్న తర్వాత దర్శకత్వం చేయాలనుంది. నాకు కథలు రాయడం తెలియదు. నాన్నకు పారితోషికం చెల్లించి కథ తీసుకుంటా. మా నాన్న ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మధ్యలో ఏ పని వదిలిపెట్టరు. నాన్న దగ్గర నేను నేర్చుకున్న గొప్ప లక్షణమది. ప్రస్తుతం ‘చోర్‌బజార్‌’ సినిమా చేస్తున్నా. ఇందులో నేను బచ్చన్‌సాబ్‌ అనే పాత్రలో కనిపిస్తా. యాక్షన్‌ నేపథ్యంలో భారీ స్థాయిలో తెరకెక్కించాం. షూటింగ్‌ పూర్తయింది. వచ్చే ఏడాది విడుదల చేస్తాం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement