పారిస్ : బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) ర్యాంప్‌పై మళ్లీ మెరిసింది. లోరియల్ పారిస్ ఫ్యాషన్ షోలో జిగేల్మంది. తన లేటెస్ట్ లుక్స్‌తో ఫ్యాషన్ వరల్డ్‌ను థ్రిల్ చేసింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన షేర్వాణీతో క్యాట్వాక్లో పాల్గొన్నది. ఆండ్రోగైనస్ అవుట్‌ఫిట్‌తో ఐశ్వర్య ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకున్నది. లోరియల్ గ్లోబల్ అంబాసిడర్‌గా ఐశ్వర్య తన స్టంట్ ప్రజెంట్ చేసింది. భారతీయ సంప్రదాయ షేర్వాణీ స్టయిల్లో డిజైన్ చేసిన బ్లాక్ కలర్ షేర్వాణీలో ఐస్ తన పర్ఫార్మెన్స్ చూపించింది.
మెన్స్వియర్ తరహాలో ఉన్న వుమెన్స్వియర్ను ర్యాంప్‌పై ఐశ్వర్య ప్రదర్శించింది. షేర్వాణీపై 10 ఇంచుల డైమండ్ ఎంబ్రాయిడరీ కఫ్స్, కింది వరకు డైమెండ్ స్కాలప్స్ ఉన్నాయి. క్యాట్వాక్కు చెందిన వీడియోను మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. బంద్గలా కాలర్, స్ప్లిట్ నెక్లైన్, ఫ్రంట్ డైమండ్ స్టడెడ్ బటన్స్, ప్యాడెడ్ షోల్డర్స్, ఫుల్ లెన్త్ స్లీవ్స్, ఫ్రంట్..సైడ్ స్లిట్స్ జాకెట్‌తో ఐశ్వర్య అట్రాక్టివ్‌గా ఉంది. జాకెట్ తగ్గ మ్యాచింగ్ ట్రౌజర్స్, హై హీల్స్, డైమండ్ ఇయర్ స్టడ్స్, రింగ్‌లు ధరించింది.