హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ) : తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి గురువారం మరోసారి విమానం వెళ్లడం కలకలం సృష్టించింది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు రాకపోకలు సాగించకూడదు. ఇలా తరచూ శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల గోపురంపై నుంచి విమానాలు వెళ్లడంపై టీటీడీ ఇప్పటికే పలుసార్లు కేంద్రవిమానయాన శాఖకు విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో కాకుండా తిరుమల గగనతలం, ఇతర ప్రదేశాల నుంచి విమానాల రాకపోకలు సాగించాలన్న టీటీడీ వినతులు విమానయాన శాఖ పట్టించుకోలేదన్న విమర్శలు న్నా యి. ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత స్పం దించి దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు.