ముంబై: ఒక పక్క అహ్మదాబాద్ ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం జరిగి వందలాది కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగి ఉండగా, ప్రమాదానికి గురైన నాలుగు రోజుల తర్వాత ఎయిరిండియా గ్రౌండ్ సేవల సిబ్బంది సంస్థ ఏఐఎస్ఏటీఎస్ ఆఫీస్‌లో ఉద్యోగులు పార్టీ జరుపుకుంటున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
విషాదం వేళ ఈ పార్టీలేంటని సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన టాటా గ్రూప్ భాగస్వామ్య సంస్థ ఏఐఎస్ఏటీఎస్ దీనికి బాధ్యులను చేస్తూ నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను విధుల నుంచి తొలగించింది.