న్యూఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి ఢిల్లీ-వాషింగ్టన్ డీసీ మధ్య విమానాలను నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. రిట్రోఫిట్ ప్రోగ్రామ్ వల్ల తమ సంస్థకు చెందిన కొన్ని బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాలు అందుబాటులో ఉండవని తెలిపింది. 26 విమానాల రిట్రోఫిటింగ్ గత నెల నుంచి ప్రారంభమైందని పేర్కొంది. సెప్టెంబరు 1న లేదా ఆ తర్వాత వాషింగ్టన్ డీసీకి వెళ్లడానికి లేదా అక్కడి నుంచి బయల్దేరడానికి టిక్కెట్లను బుక్ చేసుకున్నవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తామని వివరించింది.