సిడ్నీ నుంచి వెనక్కి ఖాళీగా.. ఎయిర్ ఇండియా విమానం
సిడ్నీ నుంచి వెనక్కి ఖాళీగా.. ఎయిర్ ఇండియా విమానం | ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు ఆస్ట్రేలియా అధికారులు నిరాకరించడంతో ఎయిర్ ఇండియా విమానం సిడ్నీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది.

న్యూఢిల్లీ : ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు ఆస్ట్రేలియా అధికారులు నిరాకరించడంతో ఎయిర్ ఇండియా విమానం సిడ్నీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమాన సిబ్బందిలో ఒకరు కరోనా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించడమే కారణమని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం విమానం సిడ్నీ బయలుదేరే ముందు సిబ్బందికి ఢిల్లీలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్ వచ్చింది. ఆదివారం ఉదయం సిడ్నీకి చేరిన అనంతరం అక్కడ అధికారులు అందరికీ మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ఫలితాలు సోమవారం వెలువడగా.. ఇందులో ఒకరికి పాజిటివ్‌గా వచ్చింది.
దీంతో సిడ్నీ – ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో కేవలం సిబ్బంది, సరుకుతో సోమవారం సిడ్నీ నుంచి విమానం బయలుదేరిందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. కొవిడ్-19 పాజిటివ్‌గా పరీక్షించిన వ్యక్తిని సిడ్నీలో ఐసోలేషన్‌లో ఉంచారు. ఇదిలా ఉండగా.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని మే 15 వరకు ఆస్ట్రేలియా.. భారత్ విమానాలను మంగళవారం నిషేధించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
భారత్‌కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్
కాస్త తగ్గినయ్.. కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు
ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం
పీపీఈ కిట్‌లో పెళ్లి.. వైరల్ వీడియో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

