రోజుకు 25లక్షల కొవిడ్ టెస్టులు లక్ష్యం : హర్షవర్ధన్
రోజుకు 25లక్షల కొవిడ్ టెస్టులు లక్ష్యం : హర్షవర్ధన్ | దేశవ్యాప్తంగా రోజుకు 25లక్షల కొవిడ్ టెస్టులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రోజుకు 25లక్షల కొవిడ్ టెస్టులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో దేశంలో 20లక్షలకుపైగా నమూనాలను మంగళవారం పరీక్షించినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. త్వరలోనే రోజు 25లక్షలు టెస్టులు చేస్తామని చెప్పారు. బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే, వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు లేకపోవడంతో కొత్త కేసుల్లో తగ్గుదల నమోదవుతుందని నిపుణులు హెచ్చరించారు.
ఈ క్రమంలో రోజువారీ పరీక్షలు పెంచనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. గతేడాదిలో కరోనా దేశంలో పట్టణాల్లో ఎక్కువగా.. వ్యాప్తి చెందగా రెండోవేవ్‌లో భారీగా సోకుతోంది. గడిచిన వారం రోజులుగా దేశంలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండగా.. బుధవారం కొత్త కేసులు 2,67,334 కేసులు నమోదయ్యాయి. వరుసగా మూడో రోజు మూడు లక్షల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 4,529 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. నిన్న ఒకే రోజు 20,08,296 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా 32,03,01,177 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
తెలంగాణకు రెండు రోజులూ వర్ష సూచన
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యకు కరోనా పాజిటివ్
ఘోరం.. మధ్యదరా సముద్రంలో పడవ మునిగి 57 మంది మృతి
హైదరాబాద్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఉత్పత్తి!
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు.. ఒకే రోజు 4,529 మంది బలి
షాకింగ్.. కొవిడ్ చికిత్స నుంచి రెమ్‌డెసివిర్ అవుట్!
వ్యాక్సిన్ తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతివ్వాలి : నితిన్ గడ్కరీ
కరోనాతో ఎమ్మెల్యే కన్నుమూత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

