Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
Nuclear War : మానవజాతికి అణ్వస్త్రాలతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బయో వెపన్స్ వంటి వాటితో ముప్పు పొంచి ఉన్నట్లు ద లాన్సెట్ నివేదిక వెల్లడించింది.
Nuclear War : మానవజాతికి అణ్వస్త్రాలతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బయో వెపన్స్ వంటి వాటితో ముప్పు పొంచి ఉన్నట్లు ద లాన్సెట్ నివేదిక వెల్లడించింది. రాబోయే 75 ఏళ్లో మానవాళి ఎదుర్కొనే పరిణామాలు, మానవజాతి మనుగడకు పొంచి ఉన్న ముప్పుపై లాన్సెట్ కమిషన్ ‘21 సెంచరీ గ్లోబల్ త్రెట్స్ టు హెల్త్’ పేరిట ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో 17 కీలక అంశాల్ని ప్రస్తావించింది. 2100 లోపు మానవాళిని కబళించే అంశాల గురించి వివరించింది.
ఈ నివేదిక ప్రకారం.. అణు యుద్ధం, ఏఐని దుర్వినియోగం చేయడం, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, జీవాయుధాలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం, స్థూలకాయం, అంతర్జాతీయ సహాయంలో క్షీణత వంటివి మానవజాతికి ముప్పుగా మారుతాయి. వీటన్నింటిపై ప్రపంచం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ సమస్యల్ని సమష్టిగా ఎదుర్కొనేందుకు కృషి చేయాలి. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే వీటి పరిణామాల్ని చాలావరకు తగ్గించవచ్చు. భవిష్యత్ తరాలకు ముప్పును తొలగించవచ్చు. ఏఐని దుర్వినియోగం చేయడం ద్వారా బయో వెపన్స్‌ను తయారు చేస్తారు.
వీటి ద్వారా ప్రపంచానికి హాని కలుగుతుంది. ఈ బయో వెపన్స్ మానవజాతిని ప్రమాదంలోకి నెడుతాయి. మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. అణుయుద్ధం వల్ల కూడా దుష్ఫలితాలుంటాయి. ఈ బాండు విస్ఫోటనం వల్ల వెలువడ్డ ధూళి కణాలు గాలిలో కలిసి సూర్యకాంతిని అడ్డుకుంటాయి. ఫలితంగా ఆహారోత్పత్తి తగ్గుతుంది. ఇది కూడా మానవజాతికి ముప్పే. ఈ కారణాలతోపాటు సంప్రదాయ యుద్ధాలు, అధికంగా మద్యం సేవించడం, అసమానతలు, ప్రకృతి విపత్తులు వంటివి కూడా మానవాళికి ముప్పుగా మారుతాయని ఈ నివేదిక పేర్కొంది.
ఈ నివేదిక రూపొందించిన లాన్సెట్ కమిషన్‌లో 35 మంది అంతర్జాతీయ నిపుణులు ఉన్నారు. వీరు జర్మనీలోని బెర్లిన్‌లో పరిశోధన చేసి, తమ నివేదికను అందజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- AI
- Bioweapons
- humanity
- Nuclear War
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

