Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
Athletics | రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు.
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ ( Athletics ) ఛాంపియన్‌షిప్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ( Young India Police School ) విద్యార్థులు సత్తా చాటారు. వివిధ పరుగు, క్షేత్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి మొత్తం 9 పతకాలు సాధించారు. వీటిలో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.
అండర్-10 బాలికల విభాగంలో సీహెచ్ లాస్యశ్రీ 60, 200 మీటర్ల పరుగు పందాల్లో స్వర్ణ పతకాలు సాధించింది. లంక పార్వతి ఈ రెండు విభాగాల్లో రజత పతకాలు గెలుచుకుంది. అండర్-10 బాలికల లాంగ్‌జంప్‌లో సాన్విక గౌడ్ కాంస్యం, అండర్-12 బాలికల లాంగ్‌జంప్‌లో ఎం.అశ్విని రజత పతకం సాధించారు. అండర్-14 బాలికల 60 మీటర్ల పరుగులో సింధం వజ్ర వరుణవి కాంస్య పతకం గెలుచుకుంది.
బాలుర విభాగంలో అండర్-12 300 మీటర్ల పరుగులో సీహెచ్ రితేష్ రజతం, సీహెచ్ జీవన్ కాంస్య పతకాలు సాధించారు. విద్యార్థుల విజయాలపై పాఠశాల సిబ్బంది ,యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, శారీరక దారుఢ్యాన్ని పెంపొందిం చేందుకు ప్రోత్సహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Aurobindo Pharma Foundation | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం
శోధ కంపెనీ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ
Vemula Prashanth Reddy | 3000 మందికి కొత్త పెన్షన్ల కోసం 31 మీటింగ్స్ పెడుతున్నరు : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
ములకలపల్లిలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ సిబ్బందిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

