టొరంటో: కెనడా సుదీర్ఘ కల నెరవేరింది. గత కొన్నేండ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తూ వస్తున్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీ అర్హత ఎట్టకేలకు నెరవేరింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో కెనడా 4-0 తేడాతో జమైకాపై అద్భుత విజయం సాధించింది. లారిన్(13ని), బుచానన్(44ని), హోలియెట్(82ని), మరియప్ప(88ని, ఓన్ గోల్) కెనడా తరఫున గోల్స్ చేశారు. జమైకాతో డ్రా చేసుకుంటే చాలు అర్హత సాధించే అవకాశమున్న తరుణంలో కెనడా సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సీఓఎన్సీఏసీఏఎఫ్ నుంచి బెర్తు దక్కించుకుంది.