హైదరాబాద్ : ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతం వెలుగుమట్లలోని 62 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 2,000 మందిని కొంత మంది కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఖాళీ చేయిస్తుందని అడ్వొకేట్ సుగుణ రావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..15 సంవత్సరాల క్రితం భూదాన్ భూముల వాళ్లు పేదలకి పట్టాలు ఇచ్చారన్నారు. వాళ్లకు నివాసం ఉండటానికి హక్కు కూడా ఉందని, హైకోర్టు కూడా వాళ్లకి పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు. పేదలను ఇబ్బంది పెట్టొద్దని స్టే ఇచ్చి, వాళ్లకు నీళ్లు, కరెంటు, స్కూల్ కూడా ఇవ్వండని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇన్ని ఆదేశాలు ఉన్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా ఎందుకు పేదల గుడెసెలు కూలుస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతం వెలుగుమట్లలోని 62 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 2000 మందిని కొంత మంది కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఖాళీ చేయిస్తుంది
15 సంవత్సరాల క్రితం భూదాన్ భూముల వాళ్లు పేదలకి పట్టాలు ఇచ్చారు.. వాళ్లకు నివాసం ఉండటానికి హక్కు కూడా… https://t.co/cyo5e6dzZe pic.twitter.com/d5YUMyb96m
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2026