నేచునల్ స్టార్ నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం హిట్. పోలీస్ శాఖలోని క్రైమ్ టీమ్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ కేసులను ఎలా పరిష్కరిస్తుందనే ఓ ఆలోచనతో దర్శకుడు శైలేంద్ర కొలను చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. ప్రేక్షకులని ఎంతగానో అలరించిన హిట్ విడుదలై ఏడాది పూర్తి కావడంతో నాని ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు.
హిట్ సినిమాలో తెలంగాణ టీంలో పనిచేసే విక్రమ్ రుద్రరాజు(కథానాయకుడి పాత్ర) ఎంతటి ఉత్కంఠకు గురి చేశాడో మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీంలో పనిచేసే కేడీ(కృష్ణ దేవ్) సమయం ఆసన్నమైంది. యువ హీరో అడివి శేష్ హిట్ 2 చిత్రంలో కేడీగా నటించనున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు. అంతకుమించి ఉత్కంఠతో హిట్ 2 ప్రయాణం ఉండనుండగా, .ఈ సినిమా ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని అందిస్తుందని అంటున్నారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. అతి త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.
AS is KD @AdiviSesh is Krishna Dev in
— BA Raju's Team (@baraju_SuperHit) March 20, 2021
HIT – The Second Case #HIT2 @NameisNani @KolanuSailesh @PrashantiTipirn @Garrybh88 @maniDop @Meenachau6 @komaleeprasad @JohnSEduri @ManishaADutt
Shoot Begins Soon pic.twitter.com/RmRsxbh8PB