Adipurush Movie Trailer | ఈ మధ్య కాలంలో ఆదిపురుష్ ట్రైలర్ కోసం ఎదురు చూసినంతగా ప్రేక్షకులు మరే సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూడలేదేమో. టీజర్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మేకర్స్ ట్రైలర్‌తో ఆకట్టుకుంటారా? అనేది సినీ అభిమానుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక గత రెండు, మూడు వారాల నుంచి ఆదిపురుష్ సినిమాకు పాజిటీవ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. రామనవమి పోస్టర్ నుంచి, హనుమంతుడి పోస్టర్, జై శ్రీరామ్ పాట, ప్రభాస్ పోస్టర్లు ఇలా ప్రతీది నెగెటివిటీని దూరం చేస్తుంది. అయితే ఎన్ని పోస్టర్లు, ప్రమోషన్లు చేసిన సినిమాకు మంచి ఓపెనింగ్స్ తీసుకురావాలంటే మాత్రం ఒక్క ట్రైలర్‌కే సాధ్యం.
ఇక సోమవారం ఫ్యాన్స్ కోసం స్పెషల్‌గా ఏఎమ్‌బీ మాల్లో ఆదిపురుష్ ట్రైలర్‌ను స్ట్రీమింగ్ చేశారు. ట్రైలర్‌ను చూసిన వారందరూ ఆహా.. ఓహో అంటూ ఎత్తేస్తున్నారు. టీజర్‌కు వంద రెట్లు ట్రైలర్ మెరుగ్గా ఉందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ప్రేక్షకుల్లో ట్రైలర్‌పై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ట్రైలర్ చూద్దామా? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇక తాజాగా మేకర్స్ యూట్యూబ్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. సీతను రావణుడు అపహరించడంతో మొదలుపెట్టి రాముడి ఆగమనం, ఆయోధ్య పరిచయం ఇలా కొనసాగించి చివరికి రామ, రావణ యుద్ధం షాట్లతో ట్రైలర్‌ను ముగించారు.
ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే టైమ్ వచ్చింది. ట్రైలర్ మాత్రం రచ్చ లేపింది. టీజర్‌తో వచ్చిన నెగెటివిటీ అంతా ట్రైలర్‌తో పటాపంచలయింది. విజువల్స్ వేరే లెవల్లో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ట్రైలర్ చివరి షాట్ అయితే మాములుగా లేదు. శివలింగం ముందు సైఫ్ అలీఖాన్ పూజ చేస్తున్న షాట్ అదిరిపోయింది. డైలాగ్స్ అయితే గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక ట్రైలర్‌తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.
రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 16న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందే న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో మూడు రోజుల పాటు ఆదిపురుష్ మూవీ ప్రదిర్శితం కానుంది.