Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో నాలుగు వెంటిలేటర్లను చోరీ చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో నాలుగు వెంటిలేటర్లను చోరీ చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన సజ్జన్, అభిజిత్ అనే ఇద్దరు వ్యక్తులు టెక్నీషియన్లమంటూ రిమ్స్‌లోకి ప్రవేశించి వెంటిలేటర్లను అపహరించినట్లు తెలిపారు.
గత నెల 30న రిమ్స్ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉన్న ఆర్ఐసీయూ, చెస్ట్ వార్డుల నుంచి ఒక్కో వెంటిలేటర్, టీబీ వార్డు నుంచి మరో రెండు వెంటిలేటర్లు చోరీకి గురయ్యాయి. మొత్తం నాలుగు పరికరాలు మాయమైనట్లు ఆస్పత్రి అధికారులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు వెంటిలేటర్లను సంచుల్లో పెట్టుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో రిమ్స్ డైరెక్టర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితులను పట్టుకున్నారు.
హైదరాబాద్ వ్యాపారికి విక్రయం
వెంటిలేటర్లను చోరీ చేసిన సజ్జన్, అభిజిత్ వాటిని హైదరాబాద్‌కు చెందిన కొండారెడ్డి అనే వైద్య పరికరాల వ్యాపారికి విక్రయించినట్లు ఎస్పీ వెల్లడించారు. చోరీ చేసిన పరికరాలను కొండారెడ్డి చంద్రపూర్‌లో కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ఆదిలాబాద్ పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి నాలుగు వెంటిలేటర్లతో పాటు కారు, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

