Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Sandra Venkata Veeraiah | కరువు పరిస్థితుల్లో మంత్రులు హెలికాప్టర్లను ఉపయోగించడం దారుణమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. హెలికాప్టర్ పర్యటనల కోసం చేస్తున్న ఖర్చులను తగ్గించి ఆ మొత్తాన్ని పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా అందించాలని సూచించారు.
Sandra Venkata Veeraiah | కరువు పరిస్థితుల్లో మంత్రులు హెలికాప్టర్లను ఉపయోగించడం దారుణమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. హెలికాప్టర్ పర్యటనల కోసం చేస్తున్న ఖర్చులను తగ్గించి ఆ మొత్తాన్ని పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా అందించాలని సూచించారు. నాయకుల హెలికాప్టర్ పర్యటనలపై సోషల్ మీడియాలో రీల్స్ చేయడాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఖమ్మంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రూ.10 లక్షల విలువైన పనుల ప్రారంభోత్సవాలకు సైతం హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ల నిర్వహణపై చూపుతున్న శ్రద్ధలో కొంతైనా రైతుల సమస్యలపై చూపించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు అన్యాయం జరుగుతోందని సండ్ర ఆరోపించారు. పెద్దవాగు ప్రాజెక్టు నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా దెబ్బతిన్న వరి, పత్తి, మిర్చి పంటలకు పరిహారం అందించాలని కోరారు. పంటలు కోల్పోయిన రైతులతో పాటు ఇళ్లు కూలిపోయి నష్టపోయిన బాధితులను కూడా ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

