Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Vaddiraju Ravichandra | రాష్ట్రంలో రైతులు పంట నష్టాలతో అల్లాడుతుంటే మంత్రులు మాత్రం హెలికాప్టర్లలో పర్యటిస్తూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు.
Vaddiraju Ravichandra | రాష్ట్రంలో రైతులు పంట నష్టాలతో అల్లాడుతుంటే మంత్రులు మాత్రం హెలికాప్టర్లలో పర్యటిస్తూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. ప్రారంభోత్సవాలకు హెలికాప్టర్లు ఉపయోగిస్తున్న ప్రభుత్వం.. పంటలు నష్టపోయిన రైతుల కష్టాలను పరిశీలించేందుకు మాత్రం వాటిని వినియోగించడం లేదని మండిపడ్డారు. ఖమ్మంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 34 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని రవిచంద్ర తెలిపారు. ఇంతటి విపత్తు సంభవించినా ప్రభుత్వం తీవ్రంగా స్పందించడం లేదని విమర్శించారు. జిల్లాలో మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పంట నష్టంపై ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం.. పంట నష్టాన్ని అంచనా వేయడంలో మాత్రం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల కష్టాలను పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. ఆపద సమయంలో వచ్చి పంట నష్టాన్ని పరిశీలించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
Telugu Cinema | హింసే పరమావధిగా టాలీవుడ్ సినిమాలు.. వెనకబడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

