నిర్మల్ అర్బన్, జూలై 1 : సామాన్యులు కూడా ఉన్నత విద్యావంతులయ్యేలా విద్యారంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదా య శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నా రు. సెయింట్ థామస్ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి టెన్త్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మంత్రి శాలువాతో సత్కరించి, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధికారులు, బోధన, బోధనేతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల ల్లో చదివి కార్పొరేట్‌కు దీటుగా మార్కులు సాధించడంపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనడానికి ఇదే చక్కటి నిదర్శనమన్నారు. ఉమ్మడి పాలనలో ఆదిలాబాద్ జిల్లా విద్యారంగంలో చాలా వెనుకబడి ఉండేదని, స్వరాష్ట్రంలో హక్కుగా చదువుకోవాలనే వాతావరణం కల్పిస్తున్నామని పేర్కొన్నా రు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెండో స్థానం, మొదటి సంవత్సరంలో మూడో స్థానంలో నిలిచిందన్నారు. టెన్త్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా రెండో స్థానం సాధించడం చాలా గొప్ప విషయమన్నారు. కేజీబీవీలు 100 శాతం ఉత్తీర్ణత, 10/10 జీపీఏ సాధించడం అభినందనీయమన్నారు. జిల్లాలో 128 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని, ఇవన్నీ సమష్టి కృషి వల్లే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూ ఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఈవో రవీందర్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వ ర్, ప్రభుత్వ పరీక్షల కమిషనర్ పద్మ, సెక్టోరియల్ అధికారిణి శ్రీ దేవి, గురుకుల పాఠశా ల ప్రిన్సిపాల్ నీరడి గంగాశంకర్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులతో పట్టణానికి నూతన శోభ..
అభివృద్ధి పనులతో నిర్మల్ పట్టణం నూతన శోభ సంతరించుకుంటున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా నుంచి బంగల్పేట్ వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నగరేశ్వరవాడ నుంచి టౌటౌన్ పోలీస్ స్టేషన్, మార్కెట్ ఏరియా మీదుగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వరకు పనులను స్వయంగా పర్యవేక్షించారు. కూరగాయల మార్కెట్లో కాలినడకన పర్యటిస్తూ చిరువ్యాపారులు, కొనుగోలుదారులతో మాట్లాడారు. నిర్మల్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
నాటి మొక్క.. నేడు వృక్షమయ్యే..
హరితహారంలో భాగంగా నిర్మల్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నాటిన మొక్క నేడు వృక్షమై ఎందరికో నీడనిస్తున్నది. పట్టణంలో పలు అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న క్రమంలో పట్ణణ పోలీస్‌స్టేషన్‌లో తాను నాటిన మొక్క.. ప్రస్తుతం ఏపుగా పెరిగి నీడనిస్తుండడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. భావితరాలకు గుర్తుగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు.
పదో తరగతి విద్యార్థినికి అభినందన
ముథోల్, జూలై 1 : మండలంలోని ఆష్టా గ్రామానికి చెందిన లక్ష్మణ్, రుక్మ దంపతులకు కూతురు నిఖిత ప్రభుత్వ పాఠశాలలో చదివి 10/10 జీపీఏ సాధించింది. విద్యార్థిని నిర్మల్ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందించి సన్మానించారు.
బస్తీ దవాఖానను సందర్శన..
నిర్మల్ చైన్‌గేట్, జూలై 1 : నిర్మల్ పట్టణంలోని బస్తీ దవాఖానను రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. రోగులకు ఇబ్బందులు కలుగకుండా వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.