మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ చతికిలబడి పోతున్నది. పీసీసీ అధ్యక్షుడి మార్పుతోనైనా మెరుగుపడుతుం దనుకున్న శ్రేణులకు నిరాశే మిగులుతున్నది. ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో క్రమంగా ఖాళీ అవుతున్నది. ఇటీవల ధాన్యం కొనుగోళ్ల విషయమై మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ధర్నాలో వీ హన్మంతరావు, ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయుల మధ్య జరిగిన మాటల యుద్ధం కాస్త.. పీఎస్సార్ నుంచి వివరణ తీసుకునే వరకూ వెళ్లింది. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న ఆ పార్టీకి బుధవారం జైపూర్ మండల అధ్యక్షుడు చిప్పకుర్తి వెంకన్న రాజీనామా చేయడంతో మరో షాక్ తగిలినట్లయ్యింది. అంతర్గత కుమ్ములాటలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చక, సరైన నాయకత్వం లేకనే బయటకు వస్తున్నట్లు ఆయన వెల్లడించగా, శ్రేణుల్లో కలవరం మొదలైంది.
మంచిర్యాల, ఫిబ్రవరి 23, నమస్తే తెలంగాణ :కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్ గా నిలుస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ నాయకు లు బాహాటంగానే విమర్శించుకుంటున్న విషయం విదితమే. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత ఖానాపూర్, నిర్మల్, బోథ్ మండల, ప ట్టణ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల్లో పార్టీ కోసం పనిచేసి న వారిని కాదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రా ధాన్యమివ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ఇటీవల విమర్శించారు. నాయకుడి పనితీరుపై అసహనం వెలిబుచ్చారు. పార్టీలో జరుగుతున్న గ్రూపు రాజకీయాలు, అసంతృప్తిని పత్రికాముఖంగా వివరించారు. రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు గతేడాది నవంబర్ 25న కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలోనూ అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని అభాసుపాలు చేసింది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, ఐఎన్టీయూసీ జనక్‌ప్రసాద్ వర్గీయుల మధ్య మాటల యుద్ధం చిలికిచిలికి గాలివానై గొడవకు దారి తీసింది. వ్యక్తిగత దూషణలకు దిగడం, సీనియర్ సభ్యుడు వీ.హనుమంతరావు వాహనాన్ని అడ్డుకొని నిరసన వ్యక్తం చేయడం, ఆయన దిగి రోడ్డుపై బైఠాయించడం, వినతి పత్రా లు అందించేందుకు ఇరువర్గాలు పోటీపడడం కాస్తా అధిష్టానం దాకా వెళ్లింది. వీహెచ్ ఫిర్యాదు మేరకు పీఎస్సార్‌ను వివరణ కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ క్రమ శిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి జనవరి 29న నోటీసులు జారీ చేశారు. పీసీసీ అధ్యక్షుడి మంతనాలతో ఆ విషయం కాస్త సద్దుమణిగింది. తాజాగా జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జైపూర్ మండల అధ్యక్ష పదవికి, క్రియాశీలక సభ్యత్వానికి చిప్పకుర్తి వెంకన్న బుధవారం రాజీనామా చేశారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, సరైన నాయకత్వం లేకపోవడం, సిద్ధాంతాలు నచ్చకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్లు ఆయన రాజీనామా పత్రంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ అధిష్టానం మొదలు రాష్ట్ర నాయకత్వం వరకూ నడుతుపున్న గ్రూపు రాజకీయాలతో శ్రేణులు ఆ పార్టీని వీడుతున్నారు. బీజేపీ కేంద్ర సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నదనే ఆరోపణలతో ఆ పార్టీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు మద్ది శంకర్ సహా 8 మంది సోమవారం రాజీనామా చేసిన విషయం విదితమే. అదే దారిలో కాంగ్రెస్ శ్రేణులు కూడా పయనిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నాయకులు రోజురోజుకూ కరువైపోతున్నారు. ఉద్యమ పార్టీ ప్రజలతో మమేకమవడం, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండడంతో ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వారంతా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే దండేపల్లి, జన్నారంతో పాటు పలు మండలాల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో గతంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా టీఆర్ఎస్లో చేరారు. మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, 20వ వార్డు కౌన్సిలర్ అంకం నరేశ్, 15వ వార్డు కౌన్సిలర్ శ్రీరాముల సుజాత, మల్లేశ్ దంపతులు, 26వ వార్డు కౌన్సిలర్ నాంపల్లి మాధవి, శ్రీనివాస్ దంపతులు, ఏడో వార్డు కౌన్సిలర్ బాదావత్ ప్రకాశ్, నస్పూర్‌కు చెందిన 14వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ కేడీకే ప్రభాకర్ రెడ్డి తదితరులు ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.
జైపూర్, ఫిబ్రవరి 23 : మంచిర్యాల జిల్లా కాంగ్రె స్ జైపూర్ మండల అధ్యక్షుడు చిప్పకుర్తి వెంకన్న త న పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిం చారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మా ట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్మలాటలు, పార్టీ విధివిధానాలు నచ్చకే రాజీనా మా చేస్తున్నానని తెలిపారు. తన అనుచరులతో చ ర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రకటి స్తామని వెల్లడించారు. తన రాజీనామా పత్రాన్ని పా ర్టీ మంచిర్యాల జిల్లా అధినాయకత్వానికి పంపి స్తున్నట్లు పేర్కొన్నారు.