ఆదిలాబాద్‌టౌన్, మార్చి 2 : క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలో అంకానేశ్వర జాతర సందర్భంగా బుధవారం నిర్వహించిన కబడ్డీ పోటీలు ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, వైస్‌ఎంపీపీ గండ్రత్ రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మాజీ వైస్‌చైర్మన్ గంగయ్య, సర్పంచ్ భూమన్న, నాయకులు జగదీశ్, నరేశ్, కిషన్, రమణ, జంగుబాపు, తదితరులు పాల్గొన్నారు.
సహకార బ్యాంకు సందర్శన
భీంపూర్, మార్చి 2 : భీంపూర్ సహకార బ్యాంకును డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి సందర్శించారు. సిబ్బంది ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ మండల రైతులు బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు ఆయన వడూర్‌లోని బైరాగి గుట్ట వద్ద పూజలు చేశారు. ఆయన వెంట ఏడీసీసీ బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్ , పీఏసీఎస్ డైరెక్టర్ ఏనుగు అశోక్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.