బాలీవుడ్ తార దిగాంగన సూర్యవంశీ మరో తెలుగు చిత్రంలో కనిపించబోతున్నారు. ఆది సాయికుమార్ హీరోగా శ్రీసత్య సాయి ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో దిగాంగన నాయికగా ఎంపికైంది. శుక్రవారం ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రంతో ఫణికృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కెకె రాధామోహన్ నిర్మాత. లక్ష్మీ రాధామోహన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ నిర్మిస్తున్న 10వ చిత్రమిది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం – ఆర్ఆర్ ధృవన్, సినిమాటోగ్రఫీ – సతీష్ ముత్యాల, ఎడిటర్ – గిడుతూరి సత్య.