ప్రేమ జంట నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ జంట నిశ్చితార్థం ఇటీవల చెన్నైలో జరిగింది. ఆది, నిక్కీ తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘ఒకరికొకరం తోడుంటేనే జీవితం. ఆయనే నా భాగస్వామి అని కొన్నేళ్ల క్రితమే నిశ్చయించుకున్నాను. ఈ రోజు మాకెంతో ప్రత్యేకమైనది. కుటుంబ సభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. మా కొత్త ప్రయాణానికి మీ ఆశీస్సులు కావాలి’ అని నిక్కీ గల్రానీ పోస్టు చేసింది. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ‘మరకతమణి’, ‘మలుపు’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు.