HomeNewsAdd This Food In Your Diet For Health Lifestyle In Summer Season
Summer Diet | సమ్మర్లో వీటిని తింటున్నారా?
Summer Diet | ఒక్కో సీజన్‌ను బట్టి ఒక్కో రకమైన ఆహారం తీసుకోవాలి. ఉదాహరణకు ఎండాకాలంలో మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. వీలైనంత వరకు సాఫ్ట్ ఫుడ్‌ను, లిక్విడ్స్‌ను తీసుకోవాలి. ఒకవేళ మసాలా ఫుడ్ తీసుకుంటే డీహైడ్రేట్‌కి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే రుతువును బట్టి భోజన విధానాన్ని పెద్దలు నిర్ణయించారు. సమ్మర్లో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా పొట్టను చల్లగా ఉంచుకోగలం.
2/5
సమ్మర్లో వచ్చే వడగాడ్పులు చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు పక్షవాతానికి కూడా ఇవి కారణం అవుతాయి. ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి బీట్రూట్ను ఆశ్రయించాలంటారు నిపుణులు. ఇందులో ఫైబర్, బీటా-కెరోటిన్ అధికంగా ఉంటాయి.
3/5
శరీరాన్ని చల్లగా ఉంచే స్వభావం పుదీనా సొంతం. జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఐరన్, పొటాషియం, విటమిన్-ఎ, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ప్రొటీన్లు అపారం. ఊబకాయాన్ని నియంత్రించడంలోనూ సాయపడుతుంది.
4/5
తులసిలో లేని సుగుణాలంటూ ఉండవు. యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనిటీ బూస్టర్, నొప్పి నివారిణి.. మచ్చుకు కొన్ని. చల్లదనాన్నిచ్చే గుణమూ ఉంది.
5/5
టమాటలోని లైకోపిన్ అతినీల లోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. గుండె జబ్బులు, పక్షవాతం, జ్ఞాపకశక్తి లోపాలు నివారిస్తుంది.
6/5
యోగర్ట్ శరీరాన్ని తేమగా ఉంచుతుంది. చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. వడదెబ్బను నివారిస్తుంది. శరీరానికి వేడి తగలకుండా అడ్డుకునే చల్లని నేస్తమిది.