మయన్మార్ మిలిటరీతో అదానీ గ్రూప్ డీల్.. బయటపడిన సంచలన నివేదిక

న్యూఢిల్లీ: మయన్మార్ మిలటరీకి చెందిన మయన్మార్ ఎకనమిక్ కార్పొరేషన్‌తో అదానీ గ్రూప్ డీల్ ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మిలటరీ.. దానిని నిరసిస్తున్న సాధారణ ప్రజలపై ఎంత అరాచకంగా వ్యవహరిస్తోందో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌కు అక్కడి మిలిటరీ సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ భూమి లీజు కోసం మయన్మార్ ఎకనమిక్ కార్పొరేషన్‌కు అదానీ గ్రూప్ 3 కోట్ల డాలర్లు చెల్లిస్తున్నట్లు యాంగూన్ రీజియన్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ నుంచి లీకైన పత్రాలు వెల్లడించాయి.
అయితే పోర్ట్ అనుమతి కోసం తాము మిలిటరీ అధికారులతో సంప్రదిస్తున్నామన్న వార్తలను అదానీ గ్రూప్ ఖండించింది. కానీ 2019, జులైలో అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ.. ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఆర్మీ చీఫ్ మిన్ ఆంగ్ హాయింగ్ను కలిసినట్లు ఇప్పుడు బయటపడిన వీడియోలు, ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. మయన్మార్ ఎకనమిక్ కార్పొరేషన్‌తోపాటు మయన్మార్ ఎకనమిక్ హోల్డింగ్స్ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్‌పై ఈ నెల 15న అమెరికా ఆంక్షలు కూడా విధించింది. మయన్మార్ మిలిటరీ వ్యాపార ప్రయోజనాలను దెబ్బ కొట్టే ఉద్దేశంతోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ డబ్బునే వాడారా?
తాజాగా బయటపడిన పత్రాలు గత నెలలో మయన్మార్‌లో మిలిటరీ తిరుగుబాటు తర్వాత లీక్ అయినట్లు ఏబీసీ న్యూస్ వెల్లడించింది. నిజానికి 2017లో రోహింగ్యా ముస్లింలను దేశం నుంచి తరిమిన సమయంలోనే మయన్మార్ మిలిటరీపై అమెరికా ఆంక్షలు విధించింది. అప్పుడే అదానీ గ్రూపును ఈ డీల్ నుంచి తప్పుకోవాలని సూచించినా వినలేదని మానవ హక్కుల లాయర్ రావన్ ఆరఫ్ ఏబీసీ న్యూస్‌కు వెల్లడించారు. అంతర్జాతీయ నేరాలకు పాల్పడటానికి అదానీ గ్రూపు ఇచ్చిన డబ్బులను కూడా మయన్మార్ మిలిటరీ వాడి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మయన్మార్ మిలిటరీతో అదానీ గ్రూప్‌కు సంబంధాలు ఉన్నట్లు 2019లో ఐక్యరాజ్య సమితి నివేదికలోనూ స్పష్టంగా ఉంది. మయన్మార్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న మిలిటరీతో విదేశీ సంస్థలు సంబంధాలు నెరపకూడదని అప్పుడే ఆ యూఎన్ రిపోర్ట్ స్పష్టంగా పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్.. 87 శాతం సంస్థల మాట ఇదే
ఆవుల కోసం గుజరాత్ ముఖ్యమంత్రి తులాభారం.. 85 కేజీల వెండి విరాళం
రాహుల్‌గాంధీకి పెళ్లి కాలేదు.. ఆయనతో జాగ్రత్త..!
సాఫ్ట్ సిగ్నల్ లేదు, 90 నిమిషాల్లోపే 20 ఓవర్లు.. ఐపీఎల్లో కొత్త రూల్స్
భన్సాలీపై అలిగిన దీపికా.. కారణం అదేనా?
నన్ను మిస్ అవుతున్నారా.. పెళ్లికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్
కొవిడ్ నిబంధనలు.. రూ. 35 వేల కోట్ల నష్టం
బబుల్ నుంచి బయటపడిన కోహ్లి.. ఇంట్లో ఫొటో షేర్ చేసిన కెప్టెన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

