కథానాయిక నర్గీస్ ఫక్రి ఇటీవల కొద్ది నెలలు విరామం కోసం ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో ఆమెను అవకాశాలు పలకరించడం మానేశాయి. నెలలపాటు తెరకు దూరమైతే ఇక ‘మళ్లీ ఇండస్ట్రీలో కనిపించవ్..’ అన్న ఆమె స్నేహితుల మాటలే నిజమయ్యాయట. అయితే ఫలితం ఏదైనా తన నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నట్లు తాజా ఇంటర్వ్యూలో నర్గీస్ ఫక్రి తెలిపింది.
ఆమె మాట్లాడుతూ…‘కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరమై విరామం లేకుండా కష్టపడితే ఇక వాళ్లతో ఉండేది ఎప్పుడు?, నా ఆర్జనను అనుభవించేది ఎప్పుడు?. అందుకే కొన్ని నెలల పాటు నటించకూడదు అనుకున్నా’ అని చెప్పింది.