Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో సినీ నటి దక్షా నగర్కర్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. అనంతరం సినీ దర్శకులు తేజ, సుధీర్ వర్మ, నిర్మాత అభిషేక్‌కు చాలెంజ్ విసిరారు.