మాస్టర్ మహేంద్రన్ హీరోగా వైకుంఠ్బోను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వసుదేవసుతం’. ధనలక్ష్మి బాదర్ల నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ హీరో సత్యదేవ్ టీజర్‌ని విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
ధర్మానికి అడ్డొస్తే.. ఎంతటి మారణహోమానికైనా వెనుకాడని ఓ యువకుని కథ ఇదని టీజర్ చెబుతున్నది. రోమాంఛితమయ్యేలా ఈ సినిమాలోని సన్నివేశాలు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేష్చంద్రమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జిజ్జు సన్నీ, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: రెయిన్బో సినిమాస్.