డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్ట్.. కరోనా పాజిటివ్
డ్రగ్స్ కేసు | డ్రగ్స్ కేసులో బాలీవుడ్ వివాదాస్పద నటుడు అజాజ్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది

ముంబై : డ్రగ్స్ కేసులో బాలీవుడ్ వివాదాస్పద నటుడు అజాజ్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అజాజ్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలించారు. అజాన్ ఖాన్‌ను విచారించిన బృందం కరోనా పరీక్షలు చేయించుకోనుంది. మార్చి 30వ తేదీన రాజస్థాన్ నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అజాజ్‌ను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సుమారు 8 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు.
అయితే డ్రగ్స్ పెడ్లర్ ఫరూఖ్ బటాటా, ఆయన కుమారుడు షాదాబ్ బటాటాను విచారించినప్పుడు ఖాన్ పేరు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక బాలీవుడ్ నటుడికి సంబంధం ఉన్న అంధేరి, లోకండ్వాలా ఏరియాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ డ్రగ్స్ కేసులో ఫరూఖ్ బటాటాను కూడా నిన్న 8 గంటల పాటు ప్రశ్నించారు. ఆయన కుమారుడు షాదాబ్‌ను గత వారం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్‌ను అరెస్టు చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లోనూ డ్రగ్స్ కేసులో, ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టులు షేర్ చేసినందుకు 2020, ఏప్రిల్‌లో అరెస్టయ్యాడు.
ఇవి కూడా చదవండి..
ఒక్క రోజులో లక్ష కరోనా కేసులు.. దేశంలో తొలిసారి
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
టిమ్స్ సేవలు అద్భుతం.. కరోనా బాధితులు హర్షం.. వీడియో
జగిత్యాల జిల్లా సిరిపూర్‌లో స్వచ్ఛంద లాక్డౌన్
రాష్ట్రంలో మండుతున్న ఎండలు..
పిల్లలు వద్దు! కరోనా వల్ల జననాల రేటులో భారీ తగ్గుదల
కంటైన్మెంట్ జోన్‌గా జోధ్‌పూర్ ఐఐటీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

