కోలార్ బంగారు గనుల నేపథ్యంలో రొమాంచితమైన యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘కేజీఎఫ్’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. యష్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. భారీ నిర్మాణ హంగులు, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ను గురువారం వెల్లడించారు. ఈ నెల 27న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో ట్రైలర్‌ను తీర్చిదిద్దుతున్నామని చిత్రబృందం ప్రకటించింది.