రవితేజ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ధమాకా’. ‘డబుల్ ఇంపాక్ట్’ ఉపశీర్షిక. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ‘పెళ్లిసందడి’ ఫేమ్ శ్రీలీల నాయికగా నటిస్తున్నది. సోమవారం సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘ఈ సినిమాలో ప్రణవి అనే చలాకీ అమ్మాయిగా కథానాయిక శ్రీలీల కనిపిస్తుంది. కథాగమనంలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: భీమ్స్ సిసిరిలియో, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగల, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణ సంస్థలు: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకత్వం: త్రినాథరావు నక్కిన.